Rajasekhar Reddy: ముగిసిన వివేకా అల్లుడి సీబీఐ విచారణ

  • సీఆర్పీసీ 160 కింద వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సీబీఐ నోటీసులు
  • హైదరాబాదులో సీబీఐ కార్యాలయానికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి
  • వివేకా హత్యాస్థలంలో దొరికిన లేఖపై ప్రశ్నించిన సీబీఐ
  • విచారణ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లిపోయిన వివేకా అల్లుడు
CBI questions Viveka son in law Rajasekhar Reddy

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ నేడు విచారించింది. ఆయనకు తొలుత సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. దాంతో, రాజశేఖర్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని వివరణ అడిగారు. కాగా, సీబీఐ విచారణ కొద్దిసేపటి కిందటే ముగియడంతో, రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.

More Telugu News