Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్న రేవంత్ రెడ్డి, కార్యకర్తలతో ఈటల భేటీ

  • ఈటల రూ.25 కోట్ల ఆరోపణలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
  • భారీ కాన్వాయ్ తో భాగ్యలక్ష్మి గుడికి వచ్చిన రేవంత్ రెడ్డి
  • కాసేపట్లో ప్రమాణం చేయనున్న కాంగ్రెస్ పార్టీ అధినేత
Revanth Reddy reaches Bhagyalaxmi temple

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ వద్ద డబ్బులేదని, ఖర్చును కేసీఆర్ పెట్టారని ఈటల ఆరోపించారు. దీనిపై నిన్న రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నుండి తమ పార్టీకి ఒక్క రూపాయి ముట్టలేదని, కాంగ్రెస్ పార్టీయే ఖర్చు పెట్టుకుందని తెలిపారు. అదే సమయంలో ఈటల తన ఆరోపణలను రుజువు చేయాలని, కేసీఆర్ నుండి డబ్బులు తీసుకోలేదని తాను భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద శనివారం సాయంత్రం తడిబట్టలతో ప్రమాణం చేస్తానని సవాల్ చేశారు. లేదా ఈటల తన ఆరోపణలను నిరూపించాలన్నారు.

చెప్పినట్లుగానే రేవంత్ రెడ్డి భారీ కాన్వాయ్ తో భాగ్యలక్ష్మి ఆలయానికి బయలుదేరారు. బయలుదేరే ముందు ఆయన మాట్లాడుతూ...తాను అంతా గుడి దగ్గరే మాట్లాడుతానని, అన్ని విషయాలు అక్కడే మాట్లాడుతానని చెప్పారు. దాదాపు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ గుడికి చేరుకున్నారు. ఆలయం వద్ద.. కేసీఆర్ నుండి డబ్బులు ముట్టలేదని ఆయన ప్రమాణం చేయనున్నారు. మరోవైపు, ఈటల రాజేందర్ తన నివాసంలో కార్యకర్తలతో భేటీ అయ్యారు.

More Telugu News