baking soda: దోశ, ఇడ్లీ పిండిలో వంట సోడా వేస్తున్నారా..?

  • వంట సోడా ఆరోగ్యానికి మంచిదేమీ కాదు
  • మోతాదు మించి, దీర్ఘకాలం పాటు వినియోగిస్తే ఎన్నో అనర్థాలు
  • దీనికి బదులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించడమే మేలు
Is adding baking soda to your dosa batter harmful for health What experts say

బేకింగ్ సోడా, వంట సోడాను పదార్థాలను పులియబెట్టేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కేక్ లు, మఫిన్లు, బ్రెడ్లు, కుకీలు అనే కాదు, దోశ, ఇడ్లీ పిండిని వేగంగా పులిసేలా చేసేందుకు బేకింగ్ సోడా వేస్తుంటారు. నిజమే సోడా అనేది వేగంగా పులిసేలా చేస్తుంది. అన్ని హోటళ్లలోనూ దీన్నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మరి ఈ బేకింగ్, వంట సోడా ఆరోగ్యానికి మంచివేనా..? అధిక మోతాదులో దీర్ఘకాలం పాటు వీటిని వినియోగించడం వల్ల అనర్థాలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నష్టాలు..

  • బేకింగ్ సోడాను అధికంగా ఉపయోగిస్తే బీపీ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో, వంట సోడాలోనూ ఉండేది సోడియం బైకార్బోనేట్. ఇది బీపీని పెంచే రసాయనం. 
  • బేకింగ్ సోడాతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జిక్ రియాక్షన్ల రిస్క్ ఉంటుంది.
  • రోజువారీగా ఉపయోగిస్తే మూత్ర పిండాల వైఫల్యం ఎదుర్కోవాల్సి రావచ్చు.
  • సోడాలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ మన పొట్టలోని యాసిడ్ తో కలుస్తుంది. దీనివల్ల జీర్ణ సామర్థ్యం తగ్గుతుంది. పోషకాలను గ్రహించే సామర్థ్యం దెబ్బతింటుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోతే అది బలహీనతకు దారితీస్తుంది.
  • బేకింగ్ సోడాతో పాంక్రియాస్ ఇన్సులిన్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో 15-20 నిమిషాల్లోనే రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతుంది. దాన్ని ఇన్సులిన్ ఫ్యాట్ గా మారుస్తుంది. 
  • సోడాలోని ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకలకు నష్టం చేస్తుంది. ఎందుకంటే సోడా వినియోగం వల్ల మన శరీరం క్యాల్షియంను గ్రహించే శక్తి బలహీనపడుతుంది. దీంతో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఏర్పడుతుంది. 

ప్రత్యామ్నాయాలు
  • సోడా ఉప్పు వేసి పులియబెట్టడం అనేది మంచి విధానం కానే కాదు. దీనికి బదులు పిండి రుబ్బుకుని సహజంగా ఒక రాత్రంతా పులిసేలా చేసుకోవడం మంచి విధానం. 
  • సాధారణ ఉప్పుతోనూ పిండి కొంత మేర పులుస్తుంది.
  • కేకుల కోసం అయితే గుడ్లు లేదంటే ఫ్లాక్స్ జెల్ ను ఉపయోగించుకోవచ్చు. 
  • బేకింగ్ ఉత్పత్తుల కోసం అయితే ఈస్ట్ అనే రైజింగ్ ఏజెంట్ ను వాడుకోవాలి.  

More Telugu News