Tollywood: ఆదిపురుష్ నుంచి అక్షయ తృతీయ కానుక.. జై శ్రీరామ్ పాట వచ్చేసింది

 Prabhas Adipurush Jai Shree Ram Lyrical Motion Poster Out
  • రెబల్ స్టార్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా
  • శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రభాస్
  • జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ ప్యాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా చిత్ర బృందం అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. శ‌నివారం ఈ సినిమాలోని జై శ్రీరామ్ లిరిక‌ల్ మోష‌న్ పోస్ట‌ర్ వీడియోను రిలీజ్ చేసింది. జై శ్రీరామ్‌..రాజారాం అంటూ శ్రీరాముడి గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ ఈ పాట సాగింది. తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. 

తెలుగులో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘మా బ‌ల‌మేదంటే మీపై న‌మ్మ‌క‌మే.. త‌ల‌పున నువ్వుంటే స‌క‌లం మంగ‌ళ‌మే... మ‌హిమాన్విత మంత్రం నీ నామ‌మే అంటూ’ శ్రీరాముడిని కీర్తిస్తూ సాగిన పాట ఆకట్టుకునేలా ఉంది. చెడుపై మంచి సాధించిన గొప్ప విజ‌యానికి ప్ర‌తీక‌గా ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు.
Tollywood
Bollywood
Prabhas
Adipurush

More Telugu News