SRH: చెపాక్ లో సన్ రైజర్స్ ఘోర పరాజయం

  • సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం
  • 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై గెలుపు
  • మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు
  • 18.4 ఓవర్లలో ఛేదించిన సూపర్ కింగ్స్
  • 77 పరుగులతో నాటౌట్ గా నిలిచిన కాన్వే
SRH huge loss to CSK

చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై ఆల్ రౌండ్ షో కనబర్చిన వేళ, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులు చేసి సూపర్ కింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. 

మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశాడు. 

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. చెన్నై ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది. అదే సమయంలో, సన్ రైజర్స్ 6 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించింది.

More Telugu News