Nara Lokesh: ఈ గడ్డపై 1000 కిమీ చేరుకోవడం నా అదృష్టం: నారా లోకేశ్

  • కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ యువగళం
  • 1000 కిమీ పూర్తి చేసుకున్న పాదయాత్ర
  • యావత్ రాయలసీమ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడి
  • యువత తమ మనోభావాలను తనతో పంచుకోవచ్చన్న టీడీపీ యువనేత
Nara Lokesh reacts to his Yuvagalam padayatra completes 1000 kms

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఆయన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ ఘనత పట్ల లోకేశ్ స్పందించారు. 

యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిమీ పూర్తి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అరాచకాలను ఎండగట్టేందుకు యువగళం ఒక ఆయుధం వంటిదని పేర్కొన్నారు. ఈ పాదయాత్రపై యువత తమ మనోభావాలను తనతో పంచుకోవచ్చని లోకేశ్ సూచించారు. 

"యువగళం పాదయాత్ర రాయలసీమ గడ్డపై 1000 కిలోమీటర్ల మైలురాయి చేరుకోవడానికి సహాయ, సహకారాలు అందించిన యావత్ రాయలసీమ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నేలపై 1000 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేయడం నా అదృష్టంగా భావిస్తూ, నా యాత్రను సఫలీకృతం చేసిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. 

రాయలసీమ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ యాత్ర ఒక ఆయుధంలా ఉపయోగపడింది. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలన్నది నా ఆకాంక్ష. రాష్ట్రంలో జగన్ అరాచకపాలనను అంతమొందించేందుకు నేను యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను ఈ దిగువ వాట్సాప్ నెంబర్ లో నేరుగా నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. 

వాట్సాప్ నెం. 96862 – 96862, Registration form: https://yuvagalam.com//register,  Email Id: suggestionsyuvagalam@gmail.com ద్వారా మీ మనోభావాలను నేరుగా నాతో పంచుకోవచ్చు" అని లోకేశ్ వివరించారు.

More Telugu News