Chiranjeevi: 'విరూపాక్ష' చిత్రంపై అద్భుతమైన రిపోర్టులు వస్తున్నాయి: చిరంజీవి

Chiranjeevi appreciates Sai Dharam Tej Virupakshma movie
  • సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా విరూపాక్ష
  • కార్తీక్ దర్శకత్వంలో చిత్రం
  • నేడు థియేటర్లలో విడుదల
  • మేనల్లుడి సినిమాపై చిరంజీవి పాజిటివ్ ట్వీట్
హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కొన్నాళ్ల పాటు కెమెరాకు దూరమయ్యారు. ఆయన నుంచి వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మేనల్లుడి చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. విరూపాక్ష చిత్రంపై అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 

"అదిరిపోయే రీతిలో పునరాగమనం చేశావు సాయిధరమ్ తేజ్. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నీ సినిమాను మెచ్చుకుంటున్నారు, దీవిస్తున్నారు. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్ర బృందం అందరికీ హృదయపూర్వక అభినందనలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, తన అర్ధాంగి సురేఖ... సాయిధరమ్ తేజ్ కు విజయోత్సవ కేక్ తినిపిస్తున్న ఫొటోను కూడా చిరంజీవి పంచుకున్నారు. 

సాయిధరమ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దర్శకత్వంలో విరూపాక్ష చిత్రం తెరకెక్కింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.
Chiranjeevi
Virupaksha
Sai Dharam Tej
Movie
Release
Tollywood

More Telugu News