TTD: విదేశీ కరెన్సీ వ్యవహారంలో టీటీడీకి కేంద్రం భారీ ఊరట

  • విదేశీ దాతలు సమర్పించే కరెన్సీ డిపాజిట్ కు కేంద్రం అనుమతినిచ్చిన కేంద్రం
  • డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి సెక్షన్ 50 కింద మినహాయింపు
  • భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని సూచన
Central Government about foreign currency for TTD

విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. విదేశీ దాతలు లేదా భక్తులు సమర్పించే కరెన్సీని డిపాజిట్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది.

తద్వారా విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు, దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేవలం టీటీడీకి మాత్రమే మినహాయింపును ఇచ్చింది. సెక్షన్ 50 ప్రకారం ఈ మినహాయింపు లభించింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు సమాచారం ఇచ్చింది కేంద్రం.

More Telugu News