DK Shivakumar: రూ. 1,415 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్ లో ప్రకటించిన డీకే శివకుమార్

DK Shivakumar announces Rs 1415 Cr assets
  • కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న డీకే  
  • డీకే నామినేషన్ ను ఆమోదించిన ఎన్నికల సంఘం
  • ఇప్పటికే డీకేపై విచారణలో ఉన్న 19 కేసులు
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కనకపుర నియోజకవర్గం నుంచి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. డీకే నామినేషన్ ను ఎన్నికల సంఘం ఆమోదించింది. తనకు రూ. 1,415 కోట్ల ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో డీకే శివకుమార్ పేర్కొన్నారు. మరోవైపు శివకుమార్ పై ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమ నగదు బదిలీ తదితర ఆరోపణలపై ఈడీ, ఐటీ సంస్థల ఆధ్వర్యంలో 19 కేసులు విచారణలో ఉన్నాయి. ఆయన తాజాగా ప్రకటించిన ఆస్తుల వివరాలతో ఈ సంస్థలు మళ్లీ విచారణ చేపట్టే అవకాశాలు లేకపోలేదు.
DK Shivakumar
Congress
Assets
Karnataka

More Telugu News