UK: బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డొమినిక్ రాబ్ రాజీనామా

  • బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో రాబ్ రాజీనామా
  • ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని వెల్లడి 
  • అక్టోబర్ లో ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న డొమినిక్
UK Deputy Prime Minister Dominic Raab resigns

బ్రిటన్ ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి డొమినిక్ రాబ్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. వేధింపులతో కూడిన ఆయన ప్రవర్తన పై పలు ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులకు సంబంధించి అధికారిక ఫిర్యాదు పైన స్వతంత్ర దర్యాఫ్తు చేపట్టడంతో ఆయన రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు అందించిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

విచారణ ప్రమాదకరమైన దృష్టాంతాన్ని నెలకొల్పిందని, అయితే తాను ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని రాబ్ అందులో పేర్కొన్నారు. తాను విచారణను కోరుకున్నానని, ఏవైనా బెదిరింపులు ఉన్నట్లు తేలితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, తాను తన మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని విశ్వసిస్తున్నానని చెప్పారు. కాగా డొమినిక్ రాబ్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఉపప్రధానిగా బాధ్యతలు చేట్టారు.

More Telugu News