Nara Lokesh: అప్పర్ భద్ర డ్యామ్ ను నిర్మిస్తే సీమ ఎడారి అవుతుంది.. జగన్ స్పందించడం లేదు: నారా లోకేశ్

  • సీమ వాసి అయినా జగన్ కు ఈ ప్రాంతంపై ప్రేమ లేదన్న లోకేశ్
  • సీమకు గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదని మండిపాటు
  • వేదవతి ప్రాజెక్టు కెపాసిటీని 4 టీఎంసీలకు తగ్గించారని విమర్శ
Rayalaseema will become as desert if Upper Bhadra dam constructed says Nara Lokesh

ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓట్లపై తప్ప సీమ ప్రజలపై సీఎంకు ధ్యాస లేదని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి గుక్కెడు నీళ్లు ఇచ్చేందుకు చేతులు కూడా రావడం లేదని దుయ్యబట్టారు. అప్పర్ భద్ర డ్యామ్ ను కర్ణాటక నిర్మిస్తే రాయలసీమ ఎడారి అవుతుందని చెప్పారు. ఈ అంశంపై జగన్ కనీసం స్పందించడం కూడా లేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో పరిశ్రమలు, విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టు కెపాసిటీని వైసీపీ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించిందని... టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కెపాసిటీని 8 టీఎంసీలకు పెంచుతామని చెప్పారు.

More Telugu News