Lions: సర్కస్ లో షాక్.. బోను నుంచి బయటపడ్డ సింహాలు.. వీడియో ఇదిగో

Lions escape from circus enclosure during a show in China spark panic
  • చైనాలోని హెనాన్ ప్రావిన్స్ లో ఘటన
  • రెండు సింహాలతో సర్కస్ విన్యాసాలు చేయించే ప్రయత్నం
  • బోను నుంచి బయటకు వచ్చేయడంతో ప్రజల పరుగు
సర్కస్ మొదలైంది. ఐరన్ గ్రిల్స్ తో కూడిన బోను (ఎన్ క్లోజర్) లోపల రెండు సింహాలు ఉన్నాయి. వాటితో విన్యాసాలు చేయించేందుకు ఇద్దరు సాహసికులు ఉన్నారు. బోను బయట ప్రేక్షకులు ఆసీనులై ఉన్నారు. యానిమల్ సర్కస్ లు ఒకప్పుడు మన దగ్గర కూడా నడిచేవి. జంతు హింస చట్టవిరుద్ధమంటూ కేంద్ర సర్కారు వీటిని నిషేధించడంతో కనుమరుగయ్యాయి. కానీ, చైనాలో ఇలాంటి యానిమల్ సర్కస్ లు పెద్ద ఎత్తున నడుస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఘటన కూడా చైనాలో జరిగిందే.

హెనాన్ ప్రావిన్స్ లోని లూయాంగ్ లో సర్కస్ సందర్భంగా అనుకోని ఘటన జరిగింది. బోను లోపల సింహాలతో విన్యాసాలు చేయించేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. అయినా కానీ, అక్కడున్న రెండు సింహాలు నిర్వాహకుల మాట వినేందుకు సుముఖంగా లేవు. స్టిక్ పట్టుకుని వాటిని అదిలిస్తూ, ఐరన్ రింగ్ నుంచి దూకాలంటూ ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ ఆ సింహాలు బోను లోపల అటూ, ఇటూ పరుగెత్తుతున్నాయే కానీ, చెప్పినట్టు చేయడం లేదు. 

చివరికి అవి బోను గేట్ ను బలవంతంగా తెరిచేసుకుని బయటకు వచ్చేశాయి. వాటిని చూసి జనాలు పరుగుపెట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట కూడా జరిగింది. చుట్టూ జనాలు ఉండడంతో సింహాలకు సైతం ఎటు పోవాలో పాలు పోలేదు. దాంతో అవి అక్కడే ఉండిపోయాయి. చివరికి అవి ఎవరినీ ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Lions
escape
circus enclosure
panic
china

More Telugu News