Twitter: ట్విట్టర్ బ్లూ టిక్ ను కోల్పోయిన చిరంజీవి, కోహ్లీ, షారుఖ్, అమితాబ్, యోగి, రాహుల్ గాంధీ

  • బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాలంటున్న ఎలాన్ మస్క్
  • ఇంత వరకు డబ్బులు చెల్లించని ఎందరో ప్రముఖులు
  • ఈరోజు పలువురి ఖాతాలకు బ్లూ టిక్ తొలగించిన ట్విట్టర్
Twitter removes blue tick for many VIPs

ట్విట్టర్ లో వ్యక్తిగత ఖాతాలకు, కంపెనీల ఖాతాలకు వెరిఫైడ్ బ్లూ టిక్ లు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఎవరైనా సరే తమ ఖాతాలను వెరిఫై చేసుకుని ఉచితంగా బ్లూ టిక్ పెట్టుకునే అవకాశం ఉండేది. అయితే, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను సొంతం చేసుకున్న తర్వాత వెరిఫైడ్ టిక్ లకు ఫీజు చెల్లించాలనే కండిషన్ ను తీసుకొచ్చారు. బ్లూటిక్ కావాలనుకునే వాళ్లు వెబ్ ద్వారా అయితే నెలకు 8 అమెరికన్ డాలర్లు... ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పే చేస్తే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ క్రమంలో నిర్ధారిత ఫీజులను చెల్లించని ఖాతాలకు ఈరోజు ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. బ్లూ టిక్ కోల్పోయిన వారిలో రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది. 

టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, నాగచైతన్య, అక్కినేని అఖిల్ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగించింది. జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు, మంచు విష్ణు బ్లూ టిక్ లు ఉన్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, విజయ్, శింబు కూడా బ్లూ టిక్ కోల్పోయారు.

2009లో ట్విట్టర్ బ్లూ టిక్ సిస్టంను ప్రవేశపెట్టింది. ఈ బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంస్థల ఖాతాలు ఒరిజినల్ అని లెక్క. ఇతరులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినా... అవి ఒరిజినల్ అకౌంట్లు కావని యూజర్లకు అర్థమయ్యేందుకు బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బ్లూ టిక్ లకు ఛార్జ్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మస్క్ భావిస్తున్నారు.

More Telugu News