ys jagan: నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్... అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ పోస్టుల భర్తీకి ఆదేశం

YS Jagan orders to fill anganwadi workers and helper jobs
  • మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
  • ఆయా శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని ఆదేశం
  • ఫౌండేషన్ స్కూళ్లలో ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని సూచన
  • పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలు ఉండాలన్న సీఎం
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. అంగన్వాడీలలో నాడు - నేడు పనుల ప్రగతి పైన ఆరా తీశారు. ఫౌండేషన్ స్కూళ్లలో ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి అంగన్వాడీలో కూడా చేపట్టాల్సిన పనులు, సదుపాయాల పైన ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే పరికరాలను అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రోత్ మానిటరింగ్ ఎక్విప్ మెంట్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంత ఎస్వోపీని రూపొందించాలన్నారు. పెన్షన్ల తరహా సంపూర్ణ పోషణ పంపిణీ కూడా సమర్థవంతంగా ఉండాలన్నారు.
ys jagan
andhra pradesh

More Telugu News