Ganga River: ఏప్రిల్ 22 నుంచి పవిత్ర గంగా నది పుష్కరాలు

  • వైశాఖ శుక్ల విదియ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశం
  • మే 3 వరకు గంగా పుష్కరాలు
  • మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలు
  • భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Ganga pushkar starts from April 22

దేశంలో అత్యంత పవిత్ర నదిగా భావించే గంగా నది పుష్కర శోభ సంతరించుకుంది. గంగా నది పుష్కరాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. వైశాఖ శుక్ల విదియ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు మే 3న వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ముగియనున్నాయి. 

పుష్కరుడు ఈ 12 రోజుల పాటు గంగానదిలో ఉంటాడని హిందువులు విశ్వసిస్తారు. అందుకే పుష్కర సమయలో గంగా స్నానం, దానం, పితృదేవతలకు తర్పణం చేయడం వంటి క్రతువులు నిర్వహిస్తారు. కాగా, పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాల్లో భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు.

More Telugu News