Chinese: సాహస విన్యాసాల్లో అపశ్రుతి.. మహిళా స్టంటర్ మృతి

  • పోల్ తాడు ఆధారంగా గాల్లో చాలా ఎత్తుకు వెళ్లిన జంట
  • ఎలాంటి సేఫ్టీ బెల్ట్ పెట్టుకోని మహిళా అథ్లెట్ 
  • చేతులు జారి కిందపడిపోవడంతో మృతి
Chinese trapeze artist falls to death during live performance with husband

చైనా ఆక్రోబాట్ ట్రాపజే ఈవెంట్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక పొడవాటి పోల్ కు కట్టిన తాడుకు వేలాడుతూ ఎంతో ఎత్తుకు వెళ్లడం ఈ ప్రదర్శనలో భాగం. చైనా సెంట్రల్ అన్హు ప్రావిన్స్ సుజోవు పట్టణంలో ఇది జరిగినట్టు బీబీసీ సంస్థ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ అవుతోంది. 

పురుష అధ్లెట్ పోల్ కు కట్టి ఉన్న తాడుని తన రెండు భుజాలకు ఆధారంగా బిగించుకున్నాడు. సదరు మహిళ ఎలాంటి ఆధారం లేకుండా పురుష అధ్లెట్ (ఆమె భర్తే) మెడకి రెండు చేతులు బిగించి వేలాడుతూ ఉంది. నిజానికి ఆ మహిళ కింద పడకూడదు. వారికి ఇలాంటి విన్యాసాలు సాధారణమే. కానీ పోల్ కు ఉన్న తాడు ఒక్కసారిగా అటూ ఇటూ షేక్ కావడంతో మహిళ బ్యాలన్స్ ఆపుకోలేక చేతులు జారిపోయి కింద స్టేజ్ పై పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు విడిచింది. పురుషుడి మాదిరే మహిళ కూడా ఆధారంగా తాడు బిగించుకుంటే ఈ విషాదం జరగకపోయేది. కనీసం పురుషు భాగస్వామి అయినా ఆమెను పడిపోకుండా కాపాడాల్సి ఉండాల్సింది. 

ఆమె పేరు సన్ కాగా, ఆమె భర్త పేరు జాంగ్. వీరిద్దరూ కలసి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ లేకుండా వారికి ఈ విన్యాసం చేయడం అలవాటేనని తెలుస్తోంది.

More Telugu News