Bandaru: అవినాశ్ చేస్తున్న ప్రయత్నాలు వేస్ట్.. అరెస్ట్ తప్పదు: బండారు

Avinash Reddy will definitely be arrested says Avinash Reddy
  • వివేకా హత్య కేసులో అవినాశ్ అరెస్ట్ కావడం ఖాయమన్న బండారు
  • నేర స్థలంలో ఆధారాలు చెరిపేయకూడదనే విషయం తెలియదా అని ప్రశ్న
  • రక్తాన్ని కడిగింది ఎవరో సజ్జల చెప్పాలని డిమాండ్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అవినాశ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే అని అన్నారు. నేరం జరిగిన స్థలంలో ఆధారాలను చెరపకూడదనే విషయం అవినాశ్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన స్థలానికి పోలీసులు రాకముందే ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేశారని అన్నారు.  


వివేకాను హత్య చేసిన తర్వాత రక్తాన్ని కడిగి, డెడ్ బాడీకి కుట్లు వేసింది ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెందుర్తి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ... 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు అలుపెరగకుండా పని చేస్తున్నారని... అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారని చెప్పారు.
Bandaru
YS Avinash Reddy
Telugudesam
YSRCP

More Telugu News