Corona Virus: దేశంలో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు

  • గత 24 గంటల్లో వెలుగులోకి 12,591 కరోనా కేసులు
  • 65,286కి చేరిన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య
  • దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమావేశం
India registers over 12 thousand corona cases

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 12,591 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 65,286కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా.. దేశంలో కరోనా వ్యాప్తిపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో బుధవారం ఓ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌లలో కేసుల సంఖ్య పెరుగుతున్న వైనం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులపై అధికారులు ఓ సవివరమైన  ప్రజెంటేషన్ ఇచ్చారు. 

మొత్తం యాక్టివ్ కేసుల్లో 92 శాతం రోగులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహరాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్స కోసం ఉద్దేశించిన 25 ప్రత్యేక ఆసుపత్రులను క్రియాశీలం చేసింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలంటూ వైద్య విద్య శాఖ మంత్రి గిరీశ్ మహాజన్ ప్రజలను అప్రమత్తం చేశారు.

More Telugu News