army: జూన్ 3 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే..!

from june 3 onwards army recruitment rally in bollaram says officials
  • బొల్లారంలో అగ్నీవీర్ల నియామకం
  • సైనికులు, అమర జవాన్ల పిల్లల కోసమే ఈ ర్యాలీ
  • టెక్నికల్, క్రీడాకారుల కేటగిరీలలో ఎంపిక
సైన్యంలో సేవలందిస్తున్న జవాన్ల పిల్లలు, మాజీ సైనికోద్యోగుల పిల్లల కోసం జూన్ 3న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ (అగ్నివీర్) నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. యుద్ధంలో అమరులైన సైనికుల కుమారులు, మాజీ సైనికోద్యోగుల సొంత సోదరులను ఈ ర్యాలీకి అనుమతిస్తామని చెప్పారు. ఈ ర్యాలీలో అగ్నివీర్ లను ఎంపిక చేస్తామని వివరించారు. టెక్నికల్ కేటగిరీ (ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోటార్ వెహికల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనర్ మెకానిక్) తదితర విభాగాల్లో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా అగ్నివీర్ ట్రేడ్స్ మెన్, స్టివార్డ్ లతో పాటు ఈత, వాలీబాల్ క్రీడాకారులకు ఓపెన్ కేటగిరిలో ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలని సూచించారు. ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వివరాలకు ఆర్మీ అధికారిక వెబ్ సైట్ కానీ బొల్లారంలోని 1ఈఎంఈ సెంటర్ హెడ్ క్వార్టర్స్ కానీ, 040-27863016 ఫోన్ నెంబర్ పై కానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.
army
agniveer
bollaram
army rally
former solidiers

More Telugu News