kakinada: మే నుంచి కాకినాడ సెజ్ కు ప్రత్యేక రైల్వే లైన్ పనులు

Special railway line works to Kakinada SEZ from May
  • అన్ని అనుమతులు ఇచ్చిన దక్షిణ మధ్య రైల్వే 
  • రూ. 300 కోట్లతో అన్నవరం–కేజీపీఎల్ రైల్వే లైన్
  • రూ. 30 కోట్లతో అన్నవరం స్టేషన్ ఆధునికీకరణ

కాకినాడ సెజ్ లోని పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనుల్లో వేగం పెరిగింది. కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను ప్రధాన రైల్వే లైన్ తో అనుసంధానించే ప్రక్రియ పట్టాలెక్కనుంది. కేజీపీఎల్ కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉంది. కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కి.మీ. మేర ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే పచ్చజెండా ఊపించింది.  దక్షిణ మధ్య రైల్వే నుంచి అన్ని రకాల అనుమతులు లభించడంతో మేలో పనులు మొదలు కానున్నాయి.  

విజయవాడ–విశాఖ మధ్య అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి కేజీపీఎల్ వరకు 15 కి.మీ మేర సరకు రవాణా కోసం ఈ ప్రత్యేక రైల్వే లైన్ రానుంది. దీనితో పాటు రూ. 30 కోట్లతో అన్నవరం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కూడా జరగనున్నాయి.  దీనికి రూ. 300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా.. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ చేపట్టింది. కేజీపీఎల్ కు ప్రత్యేక రైల్వే కోసం 90 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు రైతులతో చర్చలు జరుపుతున్నారు. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్ వే పోర్టుకు ప్రతి రోజు 16 వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులు, అయిల్, ఎల్ ఎన్ జీ రవాణా కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు కానుంది.

  • Loading...

More Telugu News