TTD: రేపు జులై నెల ఆర్జిత సేవ, శ్రీవాణి టికెట్ల విడుదల

TTD to release Arjita Seva and Srivani tickets for the month of July tomorrow
  • తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ 
  • నిన్న స్వామివారిని దర్శించుకున్న 66, 476 మంది భక్తులు
  • శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా వెల్లడి
జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవ, శ్రీవాణి టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం విడుదల చేయనుంది. ఇక తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. వారు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నేరుగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. మరోవైపు మంగళవారం తిరుమల స్వామి వారిని 66,476 మంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో వారు సమర్పించిన కానుకల రూపంలో మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. అదే సమయంలో 25,338 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తెలిపింది.
TTD
Tirumala
Tirupati
tickets
july

More Telugu News