Andhra Pradesh: ఏపీలో రాబోయే మూడ్రోజులకు వాతావరణ హెచ్చరిక

  • గురువారం నాడు ఉత్తర కోస్తాలో మోస్తరు వర్షాలు
  • దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం
  • అక్కడక్కడ వడగాలులు
AP weather report for three days

తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుండడం, మరోవైపు వడగళ్ల వానలతో తెలంగాణ సతమతమవుతుండగా... ఏప్రిల్ నెలలోనే భగ్గుమంటున్న ఎండలతో, తీవ్ర వడగాడ్పులతో ఏపీ అల్లాడిపోతోంది. ఏపీలో నిన్న 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

కాగా, ఏపీకి సంబంధించి రాబోయే మూడ్రోజులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదిక విడుదల చేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని, ఒకట్రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి నుంచి ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

దక్షిణ కోస్తాలో నేడు, రేపు పొడి వాతావరణం ఉంటుందని, వడగాలులు వీస్తాయని, ఎల్లుండి గురువారం కూడా పొడి వాతావరణమే ఉంటుందని వివరించింది. 

రాయలసీమలో సైతం ఈ మూడ్రోజుల పాటు పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో వడగాలులు కూడా వీస్తాయని తెలిపింది.

More Telugu News