restaurant: రెస్టారెంట్లో మిస్ బిహేవ్ చేసిన కస్టమర్లకు మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం చూపిన యువతి

waitress fights off aggressive customers at restaurant
  • ఫిమేల్ బ్రూస్ లీ అంటూ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్
  • ప్రశంసల్లో ముంచెత్తిన నెటిజన్లు
  • కుర్చీ విసిరిన వ్యక్తిని తన్ని పడేసింది
తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు కస్టమర్లకు... మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం ద్వారా బుద్ధి చెప్పిన ఓ వెయిట్రెస్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను సీసీటీవీ ఇడియెట్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ 'ఫిమేల్ బ్రూస్ లీ' అని ప్రశంసిస్తూ షేర్ చేసింది. ఈ మహిళ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. బ్రేవ్ గర్ల్, సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇద్దరు పురుష కస్టమర్లు రెస్టారెంట్ లో ఎదురెదురుగా కూర్చుంటారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన వెయిట్రెస్ తో ఒకతను అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది. ఆమె వెంటనే తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని అతని పైన ప్రదర్శించింది. మధ్యలో రెండో వ్యక్తి కూడా ఆమె పైకి రాగా ఆయనకు కూడా బుద్ధి చెప్పింది. తన పైకి కుర్చీ విసిరిన వ్యక్తిని ఆమె ఒక తన్ను తన్ని పడేసింది.

restaurant
woman

More Telugu News