Raghuveera Reddy: బెంగళూరు సిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీగా రఘువీరారెడ్డి?

  • చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా రఘువీరా
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలక బాధ్యతలను అప్పగించిన హైకమాండ్
  • రాహుల్ పై అనర్హత వేటు విషయంలో రఘువీరా ఆవేదన
Raghuveera Reddy as Bengaluru city Congress incharge

మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తన స్వగ్రామం నీలకంఠాపురంలో రాజకీయాలకు దూరంగా గడుపుతున్నారు. తాజాగా ఆయన మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎలెక్షన్స్ నేపథ్యంలో బెంగళూరు సిటీ ఎన్నికల ఇన్ఛార్జీగా రఘువీరారెడ్డిని హైకమాండ్ నియమించినట్టు సమాచారం. 


మరోవైపు మడకశిరలో కాంగ్రెస్ పార్టీ నేతలు, తన సన్నిహితులతో రఘువీరా మాట్లాడుతూ... ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ అసభ్యకరంగా మాట్లాడలేదని చెప్పారు. పెద్ద పెద్ద దొంగల పేరులో మోదీ ఉందని మాత్రమే అన్నారని... కొందరు ఆ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కోర్టులో శిక్షపడి నాలుగు, ఐదు ఏళ్లు అయిన వాళ్లు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారని... రాహుల్ గాంధీపై మాత్రం ఆఘమేఘాల మీద అనర్హత వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇతరులకు వర్తించని నిబంధనలు రాహుల్ కు మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ఆయనను బంగ్లా కూడా ఖాళీ చేయించారని... ఈ బాధను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.

More Telugu News