Apple: ముంబైలో యాపిల్ స్టోర్ ఓపెనింగ్.. 1984 నాటి కంప్యూటర్ తెచ్చిన అభిమాని.. టిమ్ కుక్ ఆశ్చర్యం!

Apple Fan Brings 1984 Computer To Mumbai Stores Grand Opening
  • ఈ రోజు ముంబైలో తెరుచుకున్న యాపిల్ స్టోర్
  • హాజరైన కంపెనీ సీఈవో టిమ్ కుక్
  • భారీగా తరలివచ్చిన జనం.. కుక్ ను కలిసిన సెలబ్రిటీలు
దేశంలోనే తొలి అధికారిక యాపిల్ స్టోర్ ముంబైలో ఈ రోజు ప్రారంభమైంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) లో ఏర్పాటు చేసిన స్టోర్ ఓపెనింగ్ కు యాపిల్ సీఈవో టిమ్ కుక్ హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా మంది ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు స్టోర్ ఓపెన్ కాగా.. అందుకు కొన్ని గంటల ముందే జనం క్యూలో నిలబడి ఎదురుచూశారు. అయితే ఒక యాపిల్ అభిమాని అందరి దృష్టిని ఆకర్షించారు. 1984 నాటి వింటేజ్ కంప్యూటర్ మానిటర్ ను తీసుకుని రావడమే అందుకు కారణం. 

‘‘యాపిల్ కంపెనీ జర్నీని చూపించేందుకే దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. 1984లో ఈ కంప్యూటర్ ను కొన్నాను. అప్పటి నుంచి యాపిల్ ప్రొడక్టులనే వాడుతున్నా. ఇది రెండు మెగా బైట్ల బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్. ఇప్పుడు యాపిల్ 4కే, 8కే వంటివి కంపెనీ రూపొందిస్తోంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ నిలబడ్డానని తెలిపారు. ముంబై చాలా పెద్దదని, ఇంకో స్టోర్ ఓపెన్ చేయాలని కోరారు. 

మరోవైపు యాపిల్ సెకండ్ స్టోర్ ను 20న ఢిల్లీలో ఓపెన్ చేయనున్నారు. ఇండియాలోకి యాపిల్ ఎంటరై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు యాపిల్ స్టోర్ల ప్రారంభం కోసం ఇండియాకు వచ్చిన టిమ్ కుక్ ను సెలబ్రిటీలు వరుసగా కలుస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, నటి మౌనీ రాయ్, నిర్మాత బోనీ కపూర్, ఒకప్పటి హీరోయిన్ మాధురి దీక్షిత్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్ తదితర సెలబ్రిటీలు కుక్ ను కలిశారు.

Apple
Apple CEO Tim Cook
Mumbai Store Opening

More Telugu News