Taapsee: దక్షిణాదిలో నాకు తృప్తి లభించలేదు: తాప్సీ

Iam not satisfied in South industry says Taapsee
  • ఒక నటిగా సౌత్ లో తనకు తృప్తి లభించలేదన్న తాప్సీ
  • అందుకే బాలీవుడ్ పై దృష్టి సారించానని వ్యాఖ్య
  • తాప్సీపై మండిపడుతున్న దక్షిణాది సినీ అభిమానులు
గతంలో టాలీవుడ్ పై కామెంట్స్ చేసిన సినీ నటి తాప్సీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి తన కెరీర్ ప్రారంభించిన తాప్సీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు పరిశ్రమను విమర్శించింది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావును కూడా టార్గెట్ చేసింది. అప్పట్లో నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. 

తాజాగా తాప్సీ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. దక్షిణాది సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది. తనకు దక్షిణాది సినిమాల ద్వారా గుర్తింపు వచ్చినప్పటికీ... ఒక నటిగా మాత్రం సౌత్ లో తృప్తి లభించలేదని చెప్పింది. దక్షిణాదిలో సంతృప్తి లేకపోవడం వల్లే తాను బాలీవుడ్ పై దృష్టిసారించానని తెలిపింది. 'పింక్' సినిమా తన కెరీర్లో ఒక గొప్ప మలుపు అని చెప్పింది. ఇప్పుడు తాను చాలా తృప్తిగా ఉన్నానని తెలిపింది. తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేని స్థాయికి చేరుకోవడమే తన లక్ష్యమని చెప్పింది. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు.
Taapsee
Tollywood
Bollywood

More Telugu News