Junior NTR: చార్మినార్ వద్ద షాపింగ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి.. ఫొటో వైరల్

Junior NTR wife Lakshmi Pranathi shopping at Charminar night bazaar
  • చార్మినార్ వద్ద ఉన్న నైట్ బజార్ కు వచ్చిన లక్ష్మీప్రణతి
  • సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేసిన ప్రణతి
  • వదినమ్మ సూపర్ అంటున్న జూనియన్ ఫ్యాన్స్
లక్ష్మీప్రణతి... టాలీవుడ్ అగ్రనటుడు జూనియర్ ఎన్టీఆర్ భార్య. ఒక సూపర్ స్టార్ కు భార్య అయినప్పటికీ ఆమె ఎప్పుడూ ఎంతో సాధారణంగా ఉంటారు. పెద్దగా ఆడంబరాలు లేకుండా ఒక సాధారణ గృహిణిలా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా ఆమె చార్మినార్ వద్ద నైట్ బజార్ లో షాపింగ్ చేశారు. 

దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సామాన్యమైన వ్యక్తిలా చార్మినార్ కు వచ్చి ఆమె షాపింగ్ చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక జూనియర్ ఫ్యాన్స్ అయితే ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'వదినమ్మా... మీరు సూపర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Junior NTR
Wife
Lakshmi Pranathi
Charminar

More Telugu News