CSK: సిక్సర్ల మోత మోగించిన చెన్నై బ్యాటర్లు... ఆర్సీబీ ఏం చేస్తుందో...!

  • సీఎస్కే × ఆర్సీబీ
  • బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్
  • టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు
  • కాన్వే 83, దూబే 52 పరుగులతో అలరించిన వైనం
CSK batsmen blasts huge sixers against RCB

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సిక్సర్లతో హోరెత్తించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫామ్ లో ఉన్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (3) విఫలమైనా, ఆ తర్వాత మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 

కాన్వే కేవలం 45 బంతుల్లో 83 పరుగులు చేసి చెన్నై భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. కాన్వే 6 ఫోర్లు, 6 సిక్సులు బాదడం విశేషం. ఇక రహానే తన దూకుడును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 37 పరుగులు చేశాడు. యువ ఆటగాడు శివమ్ దూబే కూడా అర్ధసెంచరీతో అలరించాడు. దూబే 27 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. దూబే స్కోరులో 2 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. 

మొయిన్ అలీ 9 బంతుల్లో 2 సిక్సులు సహా 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో జడేజా కూడా ఓ సిక్స్ బాదాడు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 1, వేన్ పార్నెల్ 1, వైశాక్ విజయ్ కుమార్ 1, మ్యాక్స్ వెల్ 1, హసరంగ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇక సొంతగడ్డపై 227 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఎలా ఛేదిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో ఆకాశ్ సింగ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ (6) బౌల్డయ్యాడు.

More Telugu News