IPL 2023: ఒక్క క్యాచ్ కోసం ఢీకొట్టుకున్న ముగ్గురు.. మరి క్యాచ్ పట్టుకున్నారా?.. మీరే చూడండి!

  • గుజరాత్, రాజస్థాన్ మ్యాచ్ లో ఆసక్తికర ఘటన
  • క్యాచ్ పట్టుకునేందుకు వచ్చి ఢీకొట్టుకున్న ముగ్గురు ఆటగాళ్లు
  • కీపర్ చేతుల్లో నుంచి గాల్లోకి లేచిన బంతి
  • క్యాచ్ పట్టుకున్న బౌలర్ బౌల్ట్.. వీడియో వైరల్
Trent Boult Grabs Catch After 3 Player Collision

ఐపీఎల్ 2023 రసవత్తరంగా సాగుతోంది. చివరి బంతి విజయాలు.. ఒక్క పరుగు ఓటములతో మ్యాచ్ లు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇదే సమయంలో అప్పుడప్పుడూ ఫన్నీ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

క్యాచ్ పట్టడానికి వెళ్లి.. ఇద్దరు ఢీకొన్న ఘటనలు గతంలో చాలానే జరిగాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటిదే జరిగింది. తొలి ఓవర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేయగా.. భారీ షాట్ ఆడేందుకు వృద్ధిమాన్ సాహా ప్రయత్నించాడు. అయితే టైమింగ్ సరిగ్గా కుదరక బ్యాట్ ఎడ్జ్‌ తీసుకుని బంతి గాల్లోకి లేచింది. 

బాల్ ను పట్టుకునేందుకు సంజు శాంసన్, హెట్‌‌మెయర్, ధ్రువ్ జురెల్ పరిగెత్తారు. బంతిని అందుకునేందుకు ప్రయత్నించి ముగ్గురూ ఢీకొన్నారు. బంతి శాంసన్ గ్లౌస్ లో పడి పైకి లేచింది. అక్కడే నిల్చుని ఉన్న బౌలర్ బౌల్ట్ వెంటనే పట్టేసుకున్నాడు. దీంతో క్షణకాలంపాటు ఒకరినొకరు చూసుకుని.. అందరూ నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. శుభ్ మన్ గిల్, మిల్లర్ రాణించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 177 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరూ వెనువెంటనే అవుటయ్యారు.

సంజు శాంప్సన్ 32 బంతుల్లోనే 60 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో వచ్చిన హెట్ మెయిర్ ఐదు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. హోరాహోరీగా సాగుతున్న మ్యాచ్ ను ఏకపక్షం చేశాడు. 26 బంతుల్లోనే 56 పరుగులు చేసి రాజస్థాన్ కు విజయం అందించాడు. పాయింట్ల పట్టికలో టీమ్ ను అగ్ర స్థానంలో నిలిపాడు.

More Telugu News