Adimulapu Suresh: మాట మార్చిన ఆదిమూలపు.. భాస్కర్‌రెడ్డి అమాయకుడన్న మంత్రి

AP Minister Adimulapu Suresh Takes U Turn From His Words
  • చట్టం తనపని తాను చేసుకుపోతుందన్న ఆదిమూలపు
  • దోషులు ఎవరైనా సరే బయటకు రావాల్సిందేనన్న మంత్రి
  • తన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఉండడంతో మాట మార్పు
  • తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి ఆదిమూలపు సురేష్ నిమిషాల్లోనే మాటమార్చారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంపై ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశానికి హాజరైన మంత్రి.. భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌పై మీ స్పందన ఏంటన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గతంలో సీఎం జగనే చెప్పారని గుర్తు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని అన్నారు. దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని పేర్కొన్నారు. 

‘‘మేమే కదా.. మా ముఖ్యమంత్రిగారే కదా సీబీఐకి ఇవ్వాలని చెప్పింది. దోషులెవరైనా బయటికి రావాల్సిందే’’ అని అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలు పార్టీ స్టాండ్‌కు భిన్నంగా ఉన్న విషయాన్ని గ్రహంచిన మంత్రి ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయానికి విలేకరులను ఆహ్వానించారు. భాస్కర్ రెడ్డి అరెస్టుపై తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. ఇది బాధాకరమన్న ఆయన భాస్కర్‌రెడ్డి అమాయకుడని, ఆయనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయన అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News