YS Vivekananda Reddy: అనుచరులతో కలిసి 10 వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరిన అవినాశ్ రెడ్డి

Kadapa MP YS Avinash Reddy Started To Hyderabad From Pulivendula
  • వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ ‌రెడ్డిపై ఆరోపణలు
  • నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న విచారణ
  • భారీ కాన్వాయ్‌తో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కడప ఎంపీ
విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ తెల్లవారుజామున అనుచరులతో కలిసి 10 వాహనాల్లో పులివెందుల నుంచి భారీ కాన్వాయ్‌తో ఆయన హైదరాబాద్ కు బయలుదేరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి గత రాత్రి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్ వస్తున్నారు.

అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే నాలుగుసార్లు విచారించింది. ఇది ఐదోసారి. ఇదే కేసులో నిన్న ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ ఆ వెంటనే అవినాశ్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, భాస్కర్‌రెడ్డికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
YS Vivekananda Reddy
YS Avinash Reddy
YS Bhaskar Reddy

More Telugu News