West Bengal: భానుడి ఉగ్రరూపం... బెంగాల్ లో వారం రోజులు స్కూళ్లు, కాలేజీల మూసివేత

Bengal govt announces one week holidays for educational institutions due to immense heat wave
  • దేశంలోని పలు ప్రాంతాల్లో అధికవేడిమి
  • బెంగాల్ లో 40 డిగ్రీలు దాటుతున్న పగటి ఉష్ణోగ్రతలు
  • అప్రమత్తమైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
  • ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి రావొద్దన్న దీదీ
ఈ వేసవిలో ఏప్రిల్ మాసంలోనే సూర్య ప్రతాపం పీక్స్ కి చేరింది. సాధారణంగా మే నెలలో భానుడి భగభగలు తీవ్రస్థాయికి చేరతాయి. కానీ ఈసారి దేశంలోని అనేక ప్రాంతాల్లో ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. 

పశ్చిమ బెంగాల్ లోనూ నిప్పులు చెరిగే ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్కూళ్లకు, కాలేజీలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది. గత కొన్నిరోజులుగా ఎండలు ముదరడంతో స్కూళ్ల నుంచి తిరిగొచ్చిన పిల్లలు తలనొప్పితో బాధపడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయని సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు.

 ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆదేశాలను పాటించాలని, త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. అంతేకాదు, ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని, బయటికి వెళ్లొద్దని సూచించారు. బెంగాల్ లో గత కొన్నిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి.
West Bengal
Heat Wave
Schools
Colleges
Mamata Banerjee
Holidays
Summer

More Telugu News