ఆరెంజ్ క్యాప్ పోటీలో విరాట్ కోహ్లీ
- టాప్ స్కోరర్ జాబితాలో మూడో స్థానానికి చేరిక
- 233 పరుగులతో మొదటి స్థానంలో శిఖర్ ధావన్
- 228 పరుగులతో రెండో స్థానంలో నిలిచిన డేవిడ్ వార్నర్
నాలుగో స్థానంలో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ 204 పరుగులతో ఉన్నాడు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 197 పరుగులతో ఆరెంజ్ క్యాప్ పోటీదారుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆరో స్థానంలో 197 పరుగులతో చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఇక పర్పుల్ క్యాప్ పోటీదారుల్లో లక్నో బౌలర్ మార్క్ వుడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు అత్యధికంగా 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. రాజస్థాన్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ 10 వికెట్లు, రషీద్ ఖాన్ 9 వికెట్లు, రవి బిష్ణోయ్ 8 వికెట్లు, అర్షదీప్ సింగ్ 8 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.