YSRCP: వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి అరెస్ట్

YCP MP Avinash Reddy Father Bhaskar Reddy Arrested By CBI
  • వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం
  • పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించిన సీబీఐ
  • రెండు రోజుల క్రితం ఎంపీ ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్‌రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో ఇటీవల దూకుడు పెంచిన సీబీఐ ఈ తెల్లవారుజామున వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. సీబీఐ బృందం ఈ ఉదయం పులివెందులలోని భాస్కర్‌రెడ్డి నివాసానికి  చేరుకుంది. అక్కడ విచారణ అనంతరం భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసి కడపకు తరలించారు. కాగా, ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు.

కాగా, అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డిని రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసింది. వివేకా హత్య కేసుతో ఆయనకు సంబంధం ఉన్నట్టు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనమైంది.

  • Loading...

More Telugu News