Sharukh Khan: సూపర్ జెయింట్స్ ను ఫినిష్ చేసిన షారుఖ్ ఖాన్

Sharukh Khan crisp innings gives Punjab Kings edge over LSG
  • ఉత్కంఠభరితంగా సాగిన లక్నో, పంజాబ్ మ్యాచ్
  • 2 వికెట్ల తేడాతో నెగ్గిన పంజాబ్ కింగ్స్
  • 10 బంతుల్లో 23 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్
  • బౌండరీతో మ్యాచ్ ముగించిన వైనం
అదేంటో గానీ... గత కొన్నిరోజులుగా ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. చివరి ఓవర్ వరకు విజయం అటూ ఇటూ మొగ్గుతూ మొత్తమ్మీద ప్రేక్షకులకు అద్భుతమైన మజా అందిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. 

అయితే, సూపర్ జెయింట్స్ కు నిరాశ కలిగిస్తూ షారుఖ్ ఖాన్ 2 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను గెలిపించాడు. షారుఖ్ ఖాన్ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులతో 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూపర్ జెయింట్స్ నిర్దేశించిన 160 పరుగుల విజయలక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లకు ఛేదించింది. 

షారుఖ్ ఖాన్ విన్నింగ్ షాట్ గా ఓ బౌండరీ కొట్టి పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. ముఖ్యంగా, సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ 147 కిమీ వేగంతో వేసిన బంతులను కూడా షారుఖ్ బౌండరీ దాటించాడు. 

అంతకుముందు, లక్నో ఇన్నింగ్స్ ను సికిందర్ రజా (57) నిలబెట్టాడు. ఓ దశలో 45 పరుగులకే 3 వికెట్లు పడినా... రజా అర్ధసెంచరీ సాధించి రన్ రేట్ తగ్గకుండా చూశాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో మాథ్యూ షార్ట్ 34, హర్ ప్రీత్ సింగ్ భాటియా 22 పరుగులు చేశారు. ఓపెనర్లు అధర్వ తైదే (0) డకౌట్ కాగా... ప్రభ్ సిమ్రన్ సింగ్ 4 పరుగులు చేసి అవుటయ్యాడు. పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ (6), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ (2) నిరాశపరిచారు. 

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో యుధ్ వీర్ సింగ్ చరక్ 2, మార్క్ వుడ్ 2, రవి బిష్ణోయ్ 2, కృష్ణప్ప గౌతమ్ 1, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, రెండు ఓటములు నమోదు చేసింది.
Sharukh Khan
Punjab Kings
LSG
IPL

More Telugu News