Imran Khan: పాకిస్థాన్ లో అత్యంత శక్తిమంతుడు ఎవరో చెప్పిన ఇమ్రాన్ ఖాన్

  • పాక్ పరిస్థితులను మరోసారి వివరించిన ఇమ్రాన్ ఖాన్
  • తనను మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం
  • సుప్రీంకోర్టును కూడా విచ్ఛిన్నం చేస్తున్నారని ఆవేదన
Imran Khan says Army Chief is the most powerful person in Pakistan

పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం నీటి బుడగ వంటిదని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలతో మరోసారి స్పష్టమైంది. పాకిస్థాన్ లో సర్వ శక్తిమంతుడు ఎవరో ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు. పాకిస్థాన్ రాజకీయాల్లో అధ్యక్షుడు, ప్రధాని కంటే ఆర్మీ చీఫ్ అత్యంత శక్తిమంతుడు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆర్మీ చీఫ్ ఆదేశాలనే పాటిస్తారని వివరించారు. 

తనను మళ్లీ గద్దెనెక్కనివ్వకుండా ఉండేందుకు సైన్యం దేశంలోని అవినీతి మాఫియాలతో చేయి కలిపిందని ఆరోపించారు. "షరీఫ్ లు, జర్దారీలు... వీళ్లందరి లక్ష్యం ఒక్కటే.... నేను మళ్లీ అధికారంలోకి రాకూడదు" అని ఇమ్రాన్ ఖాన్ వివరించారు. 

లాహోర్ లోని తన జమాన్ పార్క్ నివాసం వద్ద తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఇమ్రాన్ ప్రసంగించారు. ఆఖరికి సుప్రీంకోర్టును విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ విపత్కర సమయంలో దేశ ప్రజలు సుప్రీంకోర్టుకు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.

More Telugu News