LSG: ఆరంభం అదిరినా ఫినిషింగ్... ప్చ్!

  • ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ ఢీ
  • మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసిన జెయింట్స్
  • 74 పరుగులతో రాణించిన కేఎల్ రాహుల్
  • శామ్ కరన్ కు 3 వికెట్లు
LSG set 160 runs target to Punjab Kings

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 74 పరుగులు చేయడం లక్నో ఇన్నింగ్స్ లో హైలైట్. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ 29 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 

కానీ ఆ తర్వాత వచ్చిన వారు నిలదొక్కుకోలేకపోవడంతో సూపర్ జెయింట్స్ కు భారీ స్కోరు సాధ్యం కాలేదు. కేఎల్ రాహుల్ 19వ ఓవర్ కు క్రీజులో ఉన్నా మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహకారం లోపించింది. చివరి ఓవర్లలో లక్నో వికెట్లు టపటపా పడ్డాయి. ఆఖరి ఓవర్లో పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ వరుసగా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. శామ్ కరన్ కు 3, కగిసో రబాడాకు 2 వికెట్లు లభించగా... అర్షదీప్ సింగ్ 1, హర్ ప్రీత్ బ్రార్ 1, సికిందర్ రజా 1 వికెట్ తీశారు. 

గత మ్యాచ్ లో సంచలన ఇన్నింగ్స్ తో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించిన నికోలాస్ పూరన్ ఈ మ్యాచ్ లో ఆడిన తలి బంతికే డకౌట్ అయ్యాడు. దీపక్ హుడా 2, మార్కస్ స్టొయినిస్ 15, కృనాల్ పాండ్యా 18 పరుగులు చేశారు.

More Telugu News