TSPSC: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు నిందితులకు ఈడీ కస్టడీ

ED custody for TSPSC question paper leak accused
  • పేపర్ లీక్ నిందితులకు రెండ్రోజుల కస్టడీ
  • ఈ నెల 17, 18 తేదీల్లో కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు
  • ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్ గూడ జైల్లో ప్రశ్నించనున్న ఈడీ
సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసు నిందితులను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని రెండ్రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నెల 17, 18 తేదీల్లో నిందితుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు చంచల్ గూడ జైలులో ప్రశ్నించనున్నారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మి నుంచి వాంగ్మూలం నమోదు చేసింది.
TSPSC
Question Paper Leak
ED
Custody
Telangana

More Telugu News