TSPSC: వాయిదా పడ్డ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

TSPSC announces news dates for postponed exams
  • ప్రశ్న పత్రాల లీకేజీతో పలు టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు వాయిదా
  • కొత్త తేదీలను తాజాగా ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ
  • అగ్రికల్చర్ ఆఫీసర్ సహా పలు పరీక్షల కొత్త తేదీలతో పత్రికా ప్రకటన

ప్రశ్నపత్రాల లీకేజీతో వాయిదా పడ్డ పలు పరీక్షల కొత్త తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీని ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను మే 16న, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ పరీక్షను మే 19న, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ పరీక్షను జూన్ 28న నిర్వహించనున్నారు. అలాగే.. జులై 18, 19న జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షను, జులై 20, 21న భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షలను నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్‌సీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News