Roja: పవన్ కల్యాణ్ అవగాహన లేని వ్యక్తి: మంత్రి రోజా

Roja take a dig at Pawan Kalyan over Rishi Konda issue
  • రుషికొండ తవ్వకాలపై ఇటీవల పవన్ విమర్శలు
  • అన్ని అనుమతులు తీసుకున్నామన్న రోజా
  • నిపుణుల కమిటీ నివేదికను పవన్ పరిశీలించాలని హితవు
విశాఖ రుషికొండ తవ్వకాలపై జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల విమర్శలు గుప్పించడం తెలిసిందే. రుషికొండ తవ్వకాలను కప్పిపుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా? అని ప్రశ్నించారు. తీరప్రాంతాలు, మడ అడవుల విధ్వంసం... చెట్లు నరికివేయడం, కొండలను తవ్వేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి రోజా స్పందించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

నిబంధనలకు లోబడే తవ్వకాలు అని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని పవన్ గమనించాలని హితవు పలికారు. రుషికొండపై నిబంధనల ఉల్లంఘన జరగడంలేదని, అన్ని అనుమతులు తీసుకున్నామని రోజా స్పష్టం చేశారు. విశాఖ గీతం వర్సిటీలో లోకేశ్ తోడల్లుడి భూములు ఉన్నాయని, ఈ కారణంతోనే పవన్ ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నాడని రోజా ఆరోపించారు.
Roja
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News