Yediyurappa: కాంగ్రెస్ నేత కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్న యెడ్యూరప్ప కొడుకు

Yediyurappa son takes blessings of congress leader
  • షికారిపుర నుంచి పోటీ చేస్తున్న యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర
  • తుమకూరు సమీపంలోని సిద్ధలింగేశ్వర ఆలయానికి వచ్చిన విజయేంద్ర
  • అదే సమయంలో ఆలయంలో ఉన్న పరమేశ్వర
ఎన్నికల సందర్బంగా కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర కాళ్లకు నమస్కరించి, ఆయన ఆశీస్సులను తీసుకున్నారు. యెడ్డీకి కంచుకోట అయిన షికారిపుర నుంచి విజయేంద్ర పోటీ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఆయ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో తుమకూరు సమీపంలోని యెడియూర్ లోని సిద్ధలింగేశ్వర ఆలయానికి ఆయన వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, షెడ్యూల్డ్ కులాల నేత పరమేశ్వర అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పరమేశ్వర ఆశీస్సులను విజయేంద్ర తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Yediyurappa
Son
Congress
parameshwara

More Telugu News