Rinku Singh: రింకూ మరోసారి ఆ ఫీట్ ను సాధించడం కష్టమే: సెహ్వాగ్

Rinku may not repeat that feat says Sehwag
  • ఐపీఎల్ లో సత్తా చాటుతున్న రింకూ సింగ్
  • గుజరాత్ పై చివరి ఓవర్లో 5 సిక్సులు బాదిన రింకు
  • కేకేఆర్ కు రింకూపై భరోసా ఉంటుందన్న సెహ్వాగ్

ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ సంచలనంగా మారాడు. గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి హాట్ టాపిక్ గా మారాడు. అయితే హైదరాబాద్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో కూడా రింకూ నుంచి అభిమానులు ఇలాంటి ప్రదర్శననే ఆశించారు. ఈ మ్యాచ్ లో రింకు 58 పరుగులతో సత్తా చాటాడు. చివరి ఓవర్ లో 32 పరుగులు అవసరం కాగా... రింకూ ఒక సిక్స్ బాదాడు. ఆ ఓవర్ లో కేవలం 8 పరుగులు మాత్రమే రావడంతో కోల్ కతా ఓడిపోయింది. 

దీనిపై టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ... గుజరాత్ పై సాధించిన ఫీట్ ను రింకూ మరోసారి సాధిస్తాడని తాను భావించడం లేదని చెప్పాడు. గతంలో సచిన్, ధోనీపై ఎలాంటి నమ్మకం ఉండేదో... ఇప్పుడు కేకేఆర్ కు కూడా రింకూపై అంతే భరోసా ఉంటుందని అన్నాడు. మ్యాచ్ ఫినిషింగ్ లో ధోనీ ఉన్నాడనే నమ్మకం అందరికీ ఉండేదని... అలాగే సచిన్ క్రీజ్ లో ఉంటే విజయం మనదేనని భావించేవాళ్లమని చెప్పాడు.

  • Loading...

More Telugu News