India: మళ్లీ 10 వేల పైనే కరోనా కేసులు

India reports 10753 new Covid cases 27 deaths in past 24 hours
  • గత 24 గంటల్లో 10, 753 కేసుల నమోదు
  • 53,720కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య
  • వైరస్ వల్ల మరో 27 మంది మృతి
భారత్ లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. కొన్ని రోజులుగా వేలాది కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 10,753 పాజిటివ్ కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో, భారత్ లో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరింది. నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ ఉండగా...ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్కును దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. 

ప్రాణాంతక వైరస్ కారణంగా తాజాగా 27 మరణాలు నమోదయ్యాయి. దాంతో, ఇప్పటివరకూ 5,31,091 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్ బీబీ.1.16 కారణం అని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 6.78 శాతానికి పెరిగింది.
India
Covid cases
10753
27 deaths

More Telugu News