Nagababu: జనసేన పార్టీలో నాగబాబుకు ప్రమోషన్... పవన్ కీలక నిర్ణయం

  • ఇప్పటివరకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న నాగబాబు
  • తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పవన్
  • ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా పర్యవేక్షించనున్న నాగబాబు
  • వేములపాటి అజయ్ కు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు
Pawan Kalyan appointed Nagababu as Janasena party general secretary

మెగాబ్రదర్ నాగబాబుకు జనసేన పార్టీలో పదోన్నతి లభించింది. నాగబాబును జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ మేరకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ ఎన్నారై విభాగం కార్యకలాపాలను కూడా నాగబాబు పర్యవేక్షించనున్నారు. ఇతర దేశాల్లోని జనసేన శ్రేణులను సమన్వయపరచడం, ఎన్నారైల సేవలను పార్టీ కోసం వినియోగంచుకోవడం వంటి బాధ్యతలను కూడా నాగబాబుకు అప్పగించారు. 

ఇక, వేములపాటి అజయ్ కుమార్ ను జనసేన పార్టీ అధికార ప్రతినిధి (జాతీయ మీడియా) పదవి వరించింది. అంతేకాదు, జనసేన పార్టీ కోసం రాజకీయ శిక్షణ తరగతులు, జనసేన పార్టీ అంతర్గత క్రమశిక్షణ వ్యవహారాల పర్యవేక్షణ, బూత్ స్థాయి పర్యవేక్షణ బాధ్యతలను కూడా అజయ్ కి అప్పగించారు. 

ఈ నియామకాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. నాగబాబు, అజయ్ కుమార్ పార్టీ అభ్యున్నతి దిశగా మెరుగైన సేవలు అందిస్తారని భావిస్తున్నామని తెలిపారు. వారిద్దరికీ అభినందనలు తెలియజేశారు.

ఇప్పటివరకు నాగబాబు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అటు, వేములపాటి అజయ్ కుమార్ నెల్లూరుకు చెందిన నేత. జనసేన కోసం చురుగ్గా పనిచేస్తున్నారు.

More Telugu News