Errabelli: 'బలగం' ఫేమ్ మొగిలయ్యను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli Dayakar Rao visited Balagam fame Mogilayya in hospital
  • బలగం చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న మొగిలయ్య
  • డయాలసిస్ చేయించుకుంటుండగా గుండెపోటు
  • హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు
  • మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎర్రబెల్లి
సంచలన విజయం సాధించిన బలగం చిత్రం ద్వారా బుడగజంగాల కళాకారుడు పస్తం మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. అయితే, ప్రస్తుతం మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొగిలయ్యకు రెండు కిడ్నీలు పాడైపోగా, కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. వరంగల్ లో డయాలసిస్ చేయించుకుంటుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయనను హైదరాబాద్ కు తరలించారు. 

ఈ నేపథ్యంలో, నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్యను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి డాక్టర్లతోనూ మాట్లాడారు. మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు. వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని మొగిలయ్యకు భరోసా ఇచ్చారు.
Errabelli
Mogilayya
Balagam
BRS
Telangana

More Telugu News