Rajamouli: రాజమౌళితో పని చేయడమంటే స్కూలుకు వెళ్లడంతో సమానం: అలియా భట్

alia bhatt reveals one advice from rrr director ss rajamouli
  • రాజమౌళి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చన్న అలియా
  • ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరని వ్యాఖ్య
  • ఏ పాత్రయినా జనాలకు గుర్తుండిపోయేలా నటించాలని తనకు సూచించినట్లు వెల్లడి
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళిపై బాలీవుడ్ నటి అలియా భట్ ప్రశంసలు కురిపించారు. రాజమౌళితో పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానమని అన్నారు. ఆయనో మాస్టర్ స్టోరీ టెల్లర్ అని చెప్పుకొచ్చారు. 

టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 100 మంది ప్రపంచవ్యాప్త ప్రభావశీల వ్యక్తుల జాబితాలో రాజమౌళి, షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో అలియా భట్ మాట్లాడుతూ.. రాజమౌళిని మొదటిసారి ‘బాహుబలి’ ప్రీమియర్ లో కలిశానని, సినిమా చూస్తున్నంతసేపు ఆశ్చర్యపోయానని చెప్పారు. ఎలాగైనా ఆయన దర్శకత్వంలో నటించాలని అనుకున్నానని, ‘ఆర్ఆర్ఆర్’తో అది నెరవేరిందని చెప్పారు.

‘‘రాజమౌళి దగ్గర పని చేయడం అంటే స్కూలుకు వెళ్లడంతో సమానం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మరెన్నో కొత్త అంశాలు తెలుసుకోవచ్చు. ఆయన ఒక కథను అద్భుతంగా తెరకెక్కించగలరు. తన సినిమాల ద్వారా అందరినీ ఒక చోటుకు చేర్చుతారు’’ అని వ్యాఖ్యానించారు. 

‘‘నటన పరంగా ఏదైనా సలహా ఇవ్వమని అడిగాను. ‘ఏ క్యారెక్టర్ లో నటించినా.. ప్రేమతో చేయాలి’ అని రాజమౌళి చెప్పారు. సినిమా పెద్దగా ఆడకపోయినా.. మనం చేసిన పాత్ర జనాలకు గుర్తుండిపోయేలా నటించాలని సూచించారు’’ అని వివరించారు.
Rajamouli
Alia Bhatt
RRR
bahubali

More Telugu News