JC Prabhakar Reddy: లోకేశ్ నడుస్తుంటే బాధేసింది.. జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగం!

jc prabhakar reddy gets emotional on lokesh padayatra and blessed tha he will bea great leader
  • లోకేశ్ గొప్ప లీడర్ అవుతారన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • గాయాలు అయినా పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నారని వ్యాఖ్య
  • చంద్రబాబు దంపతులు తమ కుమారుడిని రాష్ట్రం కోసం త్యాగం చేశారని వెల్లడి 
టీడీపీ నేత నారా లోకేశ్ గురించి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గాయాలైనా లోకేశ్ పాదయాత్రను కంటిన్యూ చేస్తున్నారని, ఆయన నడుస్తుంటే బాధేసిందని అన్నారు. ఈ రోజు మీడియాతో జేసీ మాట్లాడారు.

‘‘లోకేశ్.. నువ్వు నడుస్తుంటే నాకు బాధేసింది. నా కొడుకు మూడు రోజులు నడిచినందుకే నాకు బాధ అయింది. ఏపీ పిల్లల కోసం నువ్వు పోరాడుతున్నావు. బాధను దిగమింగుకో. నీ కష్టం నేను చూశాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నావు. ఎన్నో బాధలు పడుతున్నావు.. అయినా పాదయాత్ర ఆపకు. నీ పాదయాత్ర ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది. గాయాలు అయినా పాదయాత్రను కొనసాగిస్తున్నావు. ఎంతోమంది కష్టాలు తెలుసుకుంటున్నావు. మేమున్నామని భరోసా ఇస్తున్నావు. నీ పాదయాత్రకు ఎంతోమంది బ్రహ్మరథం పడుతున్నారు’’ అని అన్నారు

చంద్రబాబు దంపతులు తమ కుమారుడిని రాష్ట్రం కోసం త్యాగం చేశారని ప్రభాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన పనులు ప్రజలకు ఆయన్ను దగ్గర చేశాయని, కానీ లోకేశ్ ప్రజల మనిషిగా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ను చూసినట్టుగా జనం లోకేశ్ ను చూస్తారని చెప్పారు.
JC Prabhakar Reddy
Nara Lokesh
Yuva Galam Padayatra
Tadipatri
Chandrababu
TDP

More Telugu News