Chandrababu: చివరికి కుక్క కూడా భరించలేకపోయింది.. జగన్ స్టిక్కర్లపై చంద్రబాబు ఎద్దేవా!

  • జగన్ స్టిక్కర్‌ను కుక్క పీకేసిందన్న చంద్రబాబు
  • సమైక్యాంధ్రలో ఏ నాయకుడికి లభించనంత గౌరవం తనకు దక్కిందన్న బాబు
  • తాను సీఎంగా పనిచేసిన కాలంలో చరిత్రలో గుర్తుండిపోయే పనులు చేశానన్న టీడీపీ అధినేత
Chandrababu Reacts on Dog Removed Jagan Sticker Video

ఏపీలోని ప్రతి ఇంటిపై జగన్ స్టిక్కర్ కనిపిస్తోందని, వాటిని చూసి కుక్కలు కూడా భరించలేకపోతున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. గుడివాడలో నిన్న నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘జగనే మా భవిష్యత్తు, జగనే మా నమ్మకం’ అన్న స్టిక్కర్లు అతికిస్తున్నారని, అది చూసి కుక్క కూడా భరించలేకపోయిందని, ఆ స్టిక్కర్‌ను పీకేసిందని అన్నారు.

తాను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని, సమైక్యాంధ్రలో ఏ నాయకుడికి లభించనంత గౌరవం తనకు లభించిందని అన్నారు. 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చరిత్రలో గుర్తుండిపోయే పనులు చేశానని అన్నారు. హైదరాబాద్‌లోని విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, సైబరాబాద్, జినోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ పార్క్ వంటి వాటిని చూసినప్పుడు తన పేరు గుర్తుకు రాకపోవచ్చని కానీ, ప్రతి ఒక్కరికీ ఒక అంతరాత్మ ఉంటుందని, ఆ పనులు చేసిందెవరో అది చెబుతుందని అన్నారు. తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చంద్రబాబు అన్నారు. తెలుగు జాతికి తానిచ్చిన ఐటీ అనే ఆయుధం వల్ల మన వాళ్లు విదేశాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News