Lord Sri Ram: 21 ఏళ్ల వయసులో శ్రీరాముడు ఎంత అందంగా ఉండేవాడో చూపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

AI creates 21 years Lord Sri Ram photos
  • రెండు రాముడి ఫొటోలను క్రియేట్ చేసిన ఏఐ
  • ఫొటోలను చూసి తన్మయత్వానికి గురవుతున్న భక్తులు
  • ఇంత అందంగా మరెవరూ పుట్టలేదంటూ సోషల్ మీడియాలో కామెంట్లు
విలువలతో కూడిన సంపూర్ణమైన జీవితానికి శ్రీరాముడు అందరికీ ఆదర్శం. ఒక వ్యక్తి ఎలా ఉండాలో చెప్పడానికి ఆయన జీవితమే అందరికీ ఆదర్శనీయం. శ్రీరాముడికి చెందిన అనేక ఊహాజనితమైన ఫొటోలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ, 21 ఏళ్ల వయసులో ఆయన ఎంత ముగ్ధమనోహరమైన రూపంలో ఉన్నారనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూపించింది. 

ఏఐ తయారు చేసిన రెండు శ్రీరాముడి చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక ఫొటోలో రాముడు సాధారణంగా ఉండగా, మరో ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఈ ఫొటోలపై ఒక యూజర్ స్పందిస్తూ... శ్రీరాముడు అంతటి అందమైన వాడు ఈ లోకంలో మరొకరు పుట్టలేదని కామెంట్ చేశాడు. అయితే, ఏఐని ఉపయోగించి ఈ చిత్రాన్ని ఎవరు రూపొందించారనేది మాత్రం తెలియరాలేదు. కానీ, రాముడి చిత్రాలను చూసిన వారంతా తన్మయత్వానికి గురవుతున్నారు.
Lord Sri Ram
AI
Photos

More Telugu News