Srikalahasti: శ్రీకాళహస్తి కైలాసగిరుల్లో ఎగసిపడుతున్న అగ్నికీలలు.. ఆకతాయిల పనేనా?

  • శ్రీకాళహస్తి ఆలయ సమీపంలో ఎగసిపడుతున్న మంటలు
  • గోశాల వైపు మంటలు వ్యాపించకుండా చర్యలు
  • అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
  • ఒకటిన్నర కిలోమీటర్ల మేర మంటలు
Wild Fire in Srikalahasti Kailasagiri

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కైలాసగిరుల్లో కార్చిచ్చు రేగింది. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో మొదలైన మంటలు రాత్రికి మరింతగా వ్యాపించాయి. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర మంటలు విస్తరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ముక్కంటి ఆలయ సమీపంలోని గోశాల వైపు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. గోశాలలో దాదాపు 700 వరకు గోవులు ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆకతాయి చర్యల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో విలువైన వృక్ష సంపద కాలిబూడద అవుతోంది.

More Telugu News